పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్య


Sat,October 19, 2019 02:27 AM

నల్లగొండ రూరల్ : పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెలుగుపల్లి గ్రామానికి చెందిన మాసిని జనార్ధన్‌రెడ్డి(21) మహారాష్ట్రలో మల్టీలెవల్ మార్కెటింగ్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన అమ్మమ్మ చనిపోవడంతో స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఈనెల 4న మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగి కాలికి గాయం కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి మధ్యాహ్నం 12గంటల సమయంలో తండ్రి ధర్మారెడ్డి వ్యవసాయ బావి వద్ద నుంచి వచ్చి చూసేసరికి మంచంపై కక్కుకొని చనిపోయిన్నట్లు తెలిపారు. జనార్ధన్ మహారాష్ట్రలో ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడని అందులో లాభాలు రాకపోవడంతోనే జనార్ధన్ మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి ధర్మారెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...