కారు ఢీకొని మహిళ మృతి


Sat,October 19, 2019 02:26 AM

నార్కట్‌పల్లి : కారు వెనుకకు తీస్తుండగా ఓ మహిళకు కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన శీలం సరమ్మ(55) దైవదర్శనం కోసం చెర్వుగట్టుకు వచ్చింది. దర్శనం అనంతరం గుట్ట కిందనున్న పార్వతమ్మ ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకొని ఆలయం బయట సేద తీర్చుకుంటుండగా డ్రైవర్ వెనుక చూడకుండా కారు(రివర్స్) వెనుకకు తీస్తుండగా సరమ్మ పైకివెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మృతురాలి కుమారుడు పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...