చిల్లేపల్లి చెక్‌పోస్ట్ వద్ద రూ.11.5లక్షలు పట్టివేత


Sat,October 19, 2019 02:26 AM

నేరేడుచర్ల : మండలంలోని చిల్లేపల్లి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం వాహన తనిఖీ అధికారులు రూ.11.5లక్షలు పట్టుకున్నట్లు ఎస్‌ఎస్‌టీ అధికారి టి.శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రారాష్ట్రం గురజాల నుంచి వస్తున్న ఇన్నోవా కారును చెక్‌పోస్టు వద్ద అధికారులు ఆపి తనిఖీ చేయగా పెద్దఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించి వాటిని లెక్కించారు. గురజాలకు చెందిన దివ్వల సాంబశివరావు తనకు బంగారం షాపు ఉందని ఆ డబ్బు తీసుకుని సూర్యాపేట మద్యం దుకాణాల డ్రాలో పాల్గొనేందుకు వెళ్తున్నానని తెలిపారు. అదేకారులో ఉన్న దామెరచర్ల మండలం వాడపల్లికి చెందిన మరో వ్యక్తి వంకాయల లక్ష్మయ్యగుప్త తాను పోస్టర్ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని, నేరేడుచర్ల పోస్టాఫీసులో సేవింగ్ చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇద్దరు పొంతనలేని సమాధానాలు చెప్పడం, మరియు ఇద్దరు వేర్వేరు ప్రాంతానికి చెందిన వారు కావడంతో నగదును సీజ్ చేసి రిటర్నింగ్ అధికారికి పంపినట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు రమేష్, వేణు, కానిస్టేబుళ్లు నట్టె శ్రీనివాస్, నాగరాజు, రమేష్, భద్రిలు ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...