చందన మృతదేహానికి రీ-పోస్టుమార్టం


Sat,October 19, 2019 02:26 AM

తుంగతుర్తి : మండల కేంద్రానికి చెందిన హోంగార్డు కటకం రవి పద్మ దంపతుల పెద్ద కుమార్తె చందన. రెండునెలల క్రితం మద్దిరాలలోని ఆమె అత్తవారి ఇంట్లో కడుపునొప్పితో మృతి చెందింది. దీంతో రవి కుటుంబసభ్యులు కూమార్తె మృతిపై అనుమానం ఉందనీ, తిరిగి చందన మృతదేహాన్ని రీ-పోస్టుమార్టం చేయాలని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొద్దిరోజులుగా పట్టించుకోకపోవడంతో రవి ఏకంగా చందన సమాధి వద్ద దీక్షను చేపట్టారు. ఈ సంఘటనను తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు రవి కుటుంబసభ్యులను ఓదార్చి దీక్షను విరమింపజేశారు.

అనంతరం డీఎస్పీ ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం సమాధి వద్ద సూర్యాపేట మెడికల్ కళాశాలకు చెందిన డాక్టర్లు ఇస్మాయిల్, అస్మీ, మద్దిరాల తహసీల్దార్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో చందన శరీరంలోని కణాలను సేకరించి రీ-పోస్టుమార్టం చేసి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు వారు తెలిపారు. నెల తర్వాత రిపోర్టులు అందజేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు అయోధ్య, శ్రీనివాస్, ఎస్‌ఐలు రంజిత్, శివకుమార్, లోకేష్, వీఆర్‌ఓ లాలమ్మ, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...