బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన కల్పించాలి


Sat,October 19, 2019 02:24 AM

రామగిరి : బాల్య వివాహాల నిర్మూలనతోపాటు గృహహింస చట్టంపై విస్త్రతంగా అవగాహన కల్పించి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కె. రాణి పేర్కొన్నారు. నల్లగొండలోని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాధికార సంస్థలో ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా సంక్షేమశాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, సఖీ కేంద్ర సిబ్బందికి గృహహింస చట్టం, బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ఆయా చట్టాలను క్షుణ్ణంగా వివరించి అవగాహన కల్పించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి సుభద్ర మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలకు విశ్వాసం ఉందని, వారికి నిస్వార్థంగా సేవలందిచాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపై ఉందన్నారు. సమావేశంలో సఖీ కేంద్రం పరిపాలనాధికారి నళిని, న్యాయవాది నూకల సంధ్యారాణి, సఖీ కేంద్రం కౌన్సిలర్ కల్పన, తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...