పెండింగ్ పనులు పూర్తిచేయాలి


Fri,October 18, 2019 02:24 AM

-ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి
నల్లగొండసిటీ : పవర్ వీక్ పనులను వెంటనే పూర్తి చేయాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సిబ్బందికి సూచించారు. గురువారం డీఈ సమావేశ మందిరంలో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 30రోజుల ప్రణాళికలో పూర్తి కాని పనులను ఈ నెల 26లోపు పూర్తి చేయాలన్నారు. విద్యుత్ బకాయిలను నూరుశాతం వసూలు చేయాలని చెప్పారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని, లూప్‌లైన్లు సరిచేసి బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ బకాయిలు కచ్చితంగా వసూలు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు మినహాయించొద్దని చెప్పారు. సమావేశంలో డైరెక్టర్లు మదన్‌మోహన్, స్వామిరెడ్డి, శ్రీనివాస్, పాండ్యానాయక్, ఎస్‌ఈ భిక్షపతి, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...