సజావుగా ఆర్టీసీ ప్రయాణం


Fri,October 18, 2019 02:23 AM

నల్లగొండ సిటీ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు సాఫీగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. గురువారం జిల్లాలోని 4ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిరాటంకంగా నడిచాయి. తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వైపు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్‌కు 10నిమిషాలకు ఓ బస్సు నడుపుతున్నారు. జిల్లాల్లోని 4డిపోల్లో 308బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సుమారు 75వేల మంది బస్సుల్లో ప్రయాణించినట్లు అంచనా వేశారు. జిల్లాలో 4 డిపోల పరిధిలో మొత్తం 430 బస్సులున్నాయి. వీటిలో 318ఆర్టీసీ బస్సులుకాగా 112 ప్రైవేటువి. గురువారం జిల్లాలో 196 ఆర్టీసీ, 112 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. సమ్మె నేపథ్యంలో తాత్కాలిక సిబ్బందితో 80శాతం బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. 2రోజుల్లో పూర్తిస్థాయిలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...