జిల్లాలో మోస్తరు వర్షం..


Fri,October 18, 2019 02:22 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లు ల నుంచి మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వాతావరణం సాధారణ కనిపించినా ఒక్కసారిగా ఆకా శం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, చల్లని గాలులుతో జల్లులు పడ్డాయి. జిల్లాల్లో 31మండలాలకుగాను 20మండలాల్లో వర్ష ప్రభావం కనిపించింది. వర్షం కారణంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ రద్దయ్యింది.

సగానికిపైగా మండలాల్లో....
జిల్లా వ్యాప్తంగా 31మండలాలు ఉండగా సగానికిపైగా ప్రాంతాల్లో వర్షం పడింది. నిడమనూరు మండలంలో మధ్యాహ్నం 12గంటలకు వర్షం ప్రారంభమైంది. పెద్దవూరలో చిరుజల్లులతో మొదలైన వర్షం క్రమంగా పెరిగింది. హాలియా, దామరచర్ల మండలాల్లో మోస్తరుగా కురవగా వీధులన్నీ జలమయమయ్యాయి. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లోని దాదాపు అన్నిమండలాల్లో వరుణుడి ప్రభావం కనిపించింది. నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి, నార్కట్‌పల్లితోపాటు నల్లగొండలో సాయంత్రం వర్షం ప్రారంభమైంది. చిట్యాలలో చలిగాలుల తీవ్రత కనిపించింది. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...