పరుగులు తీసిన ఆర్టీసీ బస్సు చక్రం


Thu,October 17, 2019 02:37 AM

-సాఫీగా సాగుతున్న ప్రయాణం
-తాత్కాలిక కండక్టర్లకు టికెట్ల జారీపై శిక్షణ
నల్లగొండసిటీ : ఆర్టీసీ కార్మికులు సమ్మె బుధవా రం 12వ రోజుకు చేరింది. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుం డా ప్రభుత్వం అన్ని ఏర్పా ట్లు చేయడంతో సాఫీగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. జిల్లాలోని అన్ని ఆర్టీ సీ డిపోల పరిధిలో బస్సులు బుధవారం యథావిధిగా నడుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 311 బస్సులు రోడెక్కడంతో ఎక్కడా సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. నల్లగొండతోపాటు దేవరకొండ, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి డిపోల్లో నుంచి బస్సులు యథాతథంగా నడిచాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నిరాటంకంగా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 12వరోజు 70వేల మంది ఆర్టీసీ బస్సుల్లో గమ్యస్థానం చేరినట్లు అధికారులు తెలిపారు. బస్సులు నడుస్తుండటంతో బస్టాండ్‌ల్లో ప్రయాణికుల సందడి కనిపించింది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో తాత్కాలిక కండక్టర్ల ద్వారా చార్జీలు వసూలు చేసిన అధికారులు రెండు రోజు ల్లో టిమ్స్ అందజేసి వాటి ద్వా రా టికెట్లు జారీ చేసేలా వారికి శిక్షణ ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు పలు డిపోల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పలు సంఘా లు, యూనియన్ల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...