అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన


Thu,October 17, 2019 02:35 AM

శాలిగౌరారం : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్, గురజాల రహదారిపై వంటావార్పు చేసి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటిపార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చెరుకు లక్ష్మి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, బండపెల్లి కొమరయ్యగౌడ్, సిర్పంగి రాములు, గోదల వెంకట్‌రెడ్డి, తిర్పాటి మల్లయ్య, గిరగాని మల్లయ్య, బోడ సునిల్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

మర్రిగూడ చౌరస్తాలో ధర్నా..
మర్రిగూడ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ, సీఐటీయూ, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మర్రిగూడ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఈదుల భిక్షంరెడ్డి, సహాయ కార్యదర్శి బూబిద సురేష్, కార్యవర్గ సభ్యులు ఆకుల రఘుమయ్య, కొట్టం రాజయ్య, పీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్డె వెంకటేష్ మాదిగ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...