చిన్నారుల ఎదుగుదల పట్ల శ్రద్ధ వహించాలి


Thu,October 17, 2019 02:34 AM

మర్రిగూడ : ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రికార్డుల్లో నమోదు చేయాలని సీడీపీవో లావణ్యకుమారి సూచించారు. బుధవారం స్థానిక ఐకేపీ సమావేశ మందిరంలో మండలంలోని అంగన్‌వాడీ టీచర్లకు ఇంక్రిమెంటల్ లర్నింగ్ అప్రోచ్(ఐఎల్‌ఏ)పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశువు దశ నుంచి చిన్నారుల ఎత్తు, బరువును ప్రతీనెల పరీక్షించి అవసరమైన వారికి వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సూపర్‌వైజర్లు పద్మ, విజయలక్ష్మీ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...