మార్చి 31, 2018 నాటికి రిజిస్ట్రేషనైన ప్లాట్లకు అనుమతి..


Wed,October 16, 2019 01:09 AM


తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్ అప్రూడ్ అండ్ ఇల్లిగల్ లే అవుట్ రూల్స్ 2015 చట్టంలో భాగంగా 30-3-2018నాటి వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్స్‌కు ఎల్‌ఆర్‌ఎస్ తీసుకునే అవకాశం కల్పించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే వారు రెగ్యులైజేషన్ ఛార్జి, బేటర్‌మెంట్ చార్జీ, డెవలప్‌మెంట్ చార్జీ, లే అవుట్ సెక్యూరిటి చార్జి, పెనాల్టీ, ఇతర చార్జీలు కట్టాల్సి ఉంటుంది. బెసిక్ రెగ్యూలరైజేషన్ చార్జీల ప్రకారం 100చదరపు మీటర్ల కన్న తక్కువగా ఉన్న ప్లాట్స్‌కు చదరపు మీటర్‌కు రూ.200లు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 101 నుంచి 300 చదరపు మీటర్ రూ. 400 చొప్పున 301 నుంచి 500 చదరపు మీటర్‌కు రూ. 600ల చొప్పున 500కు పైగా చదరపు మీటర్‌లు ఉన్న వాటికి ఒక చదరపు మీటర్‌కు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మురికివాడలలో ఉండి అనుమతి లేని ప్లాట్స్‌లలో ఉండే వారికి కేవలం ఒక చదరపు మీటర్‌కు రూ. 5 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు 30-3-2018 వరకు రిజిష్ర్టేషన్ విలువ ప్రకారం రెగ్యూలరైజేషన్ చార్జీలు, భూ విలువ చెల్లించాల్సి ఉంటుంది. బేసిక్ రెగ్యూలరైజేషన్ చార్జిలతోపాటు రిజిస్ర్టేషన్ విలువ ప్రకారం భూ విలువతోపాటు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం చదరపు గజం విలువ రూ.3,000 అంతకన్న తక్కువ ఉన్న ప్రాంతంలో రిజిస్ర్టేషన్ విలువతోపాటు అదనంగా 20శాతం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చదరపు గజం రూ. 3,001 నుంచి రూ. 5,000 ఉన్న ప్రాంతంలో 30 శాతం అదనపు చార్జీ, రూ.5,001 నుంచి రూ.10,000 ఉన్న ప్రాంతంలో 40 శాతం అదనపు చార్జీలు, చదరపు గజానికి రూ.10,001 నుంచి రూ.20,000లు రిజిష్ర్టేషన్ విలువ ఉన్న ప్రాంతంలో 50 శాతం అదనపు చార్జీలు, రూ.20,001 నుంచి రూ.30,000 విలువ ఉన్న ప్రాంతాలలో 60 శాతం అదనపు చార్జీలు, రూ. 30,001 నుంచి రూ.50,000 రిజిష్ర్టేషన్ విలువ ఉన్న ప్రాంతాలో 80 శాతం అదనపు చార్జీలు, చదరపు గజంకు రూ.50,000లకు పైగా విలువ ఉన్న ప్రాంతంలో భూ విలువతోపాటు 100 శాతం అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...