అంగన్‌వాడీకేంద్రాల్లో ఆంగ్లంలో బోధించాలి


Wed,October 16, 2019 01:08 AM

- కిషోర బాలిక పథకంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి
- జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి
నీలగిరి: అంగన్‌వాడీ కేంద్రాలకు ఇంగ్లిష్ బోధన మెటీరియల్‌ను ప్రభుత్వం అందజేస్తున్నందున అన్నికేంద్రాల్లో ఇంగ్లిష్‌లో బోధనలు నిర్వహించేందుకు టీచర్లకు అవగాహన తరగతులు నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 5వ స్టాండింగ్ కమిటీ(స్త్రీ, శిశు సంక్షేమ) సమావేశం చైర్మన్ కంకనాల ప్రవీణ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలను మానసికంగా, శారీరకంగా పాఠశాలలకు అలవాటుచేయాలనే ఉద్దేశంతో పూర్వవిద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంతోపాటు ఇతర అన్ని మండలకేంద్రాల్లో మోడల్ అంగన్‌వాడీకేంద్రాలు ఏర్పాటు చేయుటకు స్థలాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పూర్తిచేసిన వితంతువులు, అనాథలు, నిరాదరణకు గురైన మహిళలకు కిషోర శక్తి యువజన ద్వారా టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. మహిళల పట్ల వివక్ష నిర్మూలన కోసం అన్ని మండలాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినందున మహిళలకు ఆసరగా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమయానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రవీణ మాట్లాడుతూ 18సంవత్సరాలు నిండిన బాలికలకు కిషోర బాలిక పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి చైతన్యం చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చందంపేట జడ్పీటీసీ, వేములపల్లి జడ్పీటీసీలు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పాలు, పండ్లు సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, వీటిపై తగుచర్యలు తీసుకోవాలని పీడీని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో కె. వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈవోసీతాకుమారి, ఐసీడీఎస్ పీడీ సుభద్ర, జడ్పీటీసీలు రమావత్ పవిత్ర, సుంకరి ధనమ్మ, శ్రీసేవ్య కుర్ర, ఇరుగు మంగమ్మ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...