ఆగని ఆర్టీసీ చక్రం


Sun,October 13, 2019 12:21 AM

నల్లగొండ సిటీ: రద్దీకి అనుగుణంగా నడుస్తున్న బస్సులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు జిల్లాలో ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సులు నడుపుతూ గమ్యం చేరుస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో శనివారం జిల్లా వ్యాప్తంగా నాలుగు డిపోల నుంచి 292బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. సుమారు 60నుంచి 70వేల వరకు ప్రయాణించారని వెల్లడించారు. హైదారాబాద్‌ వెళ్లే బస్సులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్లు అందజేస్తున్నారు. మరోవైపు కార్మికుల నిరసన కొనసాగుతోంది. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ర్యాలీలు నిర్వహించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికారులు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు నడిపారు. జిల్లాలో 292 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. సుమారు 60నుంచి 70వేల వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రూట్లలో బస్సులను ఎప్పటీకప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. 180 ఆర్టీసీతో పాటు 112 ప్రైవేట్‌ బస్సులను నడిపి, ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆర్టీసీ సిబ్బంది తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. బస్టాండ్‌ నుంచి మూతికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ర్యాలీగా ప్రొ.జయశంకర్‌ సార్‌ విగ్రహం వద్దకు వెళ్లి 2 గంటలపాటు మౌన దీక్ష చేపట్టారు. తిరిగి ర్యాలీతో బస్టాండ్‌ చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. సమ్మెకు బీజేపీ నాయకులతో పాటు మున్సిపాల్‌ కార్మికులు ర్యాలీగా వచ్చి సంఘీభావం ప్రకటించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...