సాగర్‌ @589.80 అడుగులు


Sun,October 13, 2019 12:20 AM

నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు ఎగువ కృష్ణా పరివాహక ప్రాజెక్ట్‌ల నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో డ్యాం క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదలను శనివారం ఎన్నెస్పీ అధికారులు నిలుపుదల చేశారు. శ్రీశైలం రిజలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు 64703 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతూ కుడి, ఎడమ,వరదకాల్వల ద్వారా 53854 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

నీటి సమాచారం
నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 590 గాను 589.80 అడుగులకు చేరుకొని 311.4474 టీఎంసీల నీరు శనివారం నిల్వ ఉంది. సాగర్‌ జలాశయం ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 33170 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8454 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 10120 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, డీటీ గేట్సు (డైవర్షన్‌ టన్నెల్‌) ద్వారా 10, వరదకాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, రిజర్వాయర్‌ నుంచి మొత్తం 53854 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 884.40 అడుగుల వద్ద 211.4385 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 16423 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది.

పులిచింతల 174.604 అడుగులు
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 174.604 (45.154 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 38464 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. పులిచింతల ప్రాజెక్టు మొత్తం గేట్లు 24, కాగా 2 గేట్ల నుంచి 20649 క్యూసెక్కుల నీరు, గేట్ల్ల లీకేజీల ద్వారా 1000 క్యూసెక్కుల నీరు, తెలంగాణ విద్యుత్‌ ఉపకేంద్రం ద్వారా 18000 క్యూసెక్కుల నీరు, మొత్తం 39649 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో విడుదలవుతుంది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...