పండగ వేళ విషాదం


Thu,October 10, 2019 03:08 AM

కట్టంగూర్/కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన కోకా పరమేష్ మంగళవారం సాయంత్రం దసరా పండుగకు అయిటిపాములలోని అత్తగారింటికి భార్య అనిత, కుమారుడు ము న్నా అలియాస్ మల్లికార్జున్, అల్లుడు మల్లెపోగు కళ్యాణ్‌తో కలిసి బైక్‌పై బయల్దేరారు. పామనుగుండ్ల గ్రామశివారులోని టీమేజ్ పరిశ్రమ వద్ద వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారు ఢీకొన్న వేగానికి బైక్‌పై నలుగురు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే అనిత(28) మృతి చెందగా తీవ్రగాయాలైన పరమేష్, మున్నా, కళ్యాణ్‌లను నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10గంటల సమయంలో పరమేష్(30)మృతిచెందాడు. మున్నా, కళ్యాణ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల బంధువు ఆదిమల్ల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్రా అంతిరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలం నుంచి కారు డ్రైవర్ పరారయ్యాడు. భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో చెర్వుగట్టులో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇనుపాముల వద్ద ఇద్దరు...
కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా మరోనలుగురు గాయపడ్డారు. చిట్యాలకు చెందిన పందిరి యాదయ్య (65)వ్యాపార పనుల నిమిత్తం భార్య కళమ్మతో కలిసి సొంతకారులో ఖమ్మం జిల్లా మధిరకు వెళ్లి బుధవారం తిరుగు ప్రయాణమయ్యాడు. ఇనుపాముల వద్ద కారును పక్కకు ఆపి కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అదే దారిలో (హైదరాబాద్ వైపు) వెళుతున్న లారీ పక్కకు ఆపిన కారును ఢీకొట్టి అతడి శరీరంపైకి దూసుకెళ్లింది. యాదయ్య అక్కడికక్కడే మృతిచెందగా ఆయన భార్య కళమ్మ తీవ్రంగా గాయపడింది. ఇదే గ్రామ శివారులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతిచెందాడు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన జిల్లా బాబు దసరా పండుగకు తన అత్తగారి ఊరైన చెర్కుపల్లికి వచ్చి తిరిగి బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో బాబు కుమారుడు విశాల్ (10) అక్కడికక్కడే మృతిచెందగా బాబుతో పాటు ఆయన భార్య వెన్నెల, కూతురు పుష్ప తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నాడు.

చీమలగడ్డ ైఫ్లెఓవర్‌పై మరొకరు..
నకిరేకల్, నమస్తే తెలంగాణ : నకిరేకల్‌లోని చీమలగడ్డ ైఫ్ల్రె ఓవర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం బైక్‌ను కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. నల్లగొండ మండ లం జి.చెన్నారం గ్రామానికి చెందిన ఉప్పునూతల సైదులు(35) స్వగ్రామం నుంచి సూర్యాపేటకు బైక్‌పై వెళ్తున్నాడు. నకిరేకల్ ైఫ్ల్రెవర్‌పై కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. జాతీయ రహదారిపై రాంగ్‌రూట్లో ప్రయాణించడంతోనే ప్రమా దం జరిగిందని ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...