ఎంపికైన కానిస్టేబుళ్లకు నేడు పోలీస్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన


Thu,October 10, 2019 03:07 AM

నల్లగొండసిటీ : కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు ఎంపికైన అభ్యర్థులంతా గురువారం ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1954 మంది అభ్యర్థులు కానిస్టేబుళ్లుగా ఎంపికవగా.. 1087 మంది నల్లగొండ జిల్లాకు, 867 మంది సూర్యాపేట జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉన్నారన్నారు. వీరంతా తమ విద్యార్హత పత్రాలు, స్టడీ, కండెక్ట్, కమ్యూనిటీ, నాన్, క్రిమిలేయర్ స్పెషల్‌కేటగిరి, క్రీడ, ఎన్‌సీసీ, సీపీపీ , పీఈసీ, హెచ్‌జీ అన్ని సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌కార్డులతో స్వయంగా రావాలని సూచించారు. సర్టిఫికెట్లను సెట్‌గా చేసి సంతకం చేసి ఆ కాపీని అందజేయాలన్నారు. అదే రోజు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా అధ్యర్థులకు నల్లగొండలో, సూర్యాపేట వారికి ఆ జిల్లా కేంద్రంలో నిర్ణయించిన తేదీల ప్రకారం వైద్యపరీక్షలు చేస్తామన్నారు. దీని కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...