మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ షురూ


Thu,October 10, 2019 03:07 AM

నల్లగొండసిటీ : మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య తెలిపారు. బుధవారం ఆయన దీనికి సంబంధించిన గెజిట్ నెంబర్ 1729ను జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసేందుకు ఈ నెల 16 చివరి గడువు అని పేర్కొన్నారు. మొదటి రోజు జిల్లాలోని 7 సర్కిళ్ల పరిధిలో 13 దరఖాస్తులు అందగా.. అందులో నల్లగొండ సర్కిల్ నుంచి 4, మిర్యాలగూడ సర్కిల్ నుంచి 1 , నకిరేకల్ నుంచి 1, చండూరు నుంచి 3, హాలియా సర్కిల్ నుంచి 4 దరఖాస్తులు రాగా నాంపల్లి, దేవరకొండ సర్కిళ్ల నుంచి ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాలేదని తెలిపారు. గురువారం నుంచి దరఖాస్తులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...