టీఆర్‌ఎస్‌దే విజయం


Thu,October 10, 2019 03:07 AM

హుజూర్‌నగర్, నమస్తేతెలంగాణ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే విజయమని ఉప ఎన్నికల ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో హుజూర్‌నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌లో చేరగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపఎన్నిక హుజూర్‌నగర్ అభివృద్ధి కోసం వచ్చిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి రాబోయే నాలుగున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి హుజూర్‌నగర్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా చేస్తామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 40గ్రామాల్లో ప్రచారం పూర్తయిందన్నారు. సైదిరెడ్డి గెలుపు కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు సమన్వయం తో పనిచేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రజాప్రతినిథులు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని, ఇది అభివృద్ధికి శుభసూచకమన్నారు. ఐదేండ్లు అభివృద్ధికి దూరమైన హుజూర్‌నగర్‌కు ఈ ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి ఏమిటో రుచి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, జితేందర్‌రెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, గెల్లి రవి, చిలకరాజు లింగయ్య, కడియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...