యాదాద్రిలో ఘనంగా లక్షపుష్పార్చన


Thu,October 10, 2019 03:07 AM

యాదాద్రి భువనగిరిప్రతినిధి, నమస్తే తెలంగాణ:శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం లక్ష పుష్పార్చనను కన్నుల పండువగా నిర్వహించారు. ఏకాదశి కావడంతో శ్రీవారికి లక్ష పుష్పాలతో కొలుస్తూ అపురూపంగా పూజాకైంకర్యాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు నల్లంతీగల్ లక్ష్మీనరసిం హాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారు జాము నాలుగు గంటల నుంచి నిత్య పూజల కోలాహలంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కళ్యాణ తంతును జరిపారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన శ్రీస్వామి అమ్మవారలకు హారతి నివేదన జరిపారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. స్వర్ణపుష్పార్చన దర్శనమూర్తులను అర్పించారు.రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

రూ. 5, 93,996 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 5,93,996 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.73, 538, రూ. 100 టిక్కెట్లతో రూ. 24,200, కల్యాణకట్ట ద్వారా రూ. 14,000, ప్రసాదవిక్రయాలతో రూ. 2,28, 035, ఇతర విభాగాల నుంచి రూ. 1, 84, 699 తో పాటు అన్ని విభాగాలు కలుపుకుని శ్రీవారి ఖజానాకు రూ. 5, 93, 996 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడి శివకుమార్, కృష్ణయ్య, బాలాజీ, సార నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...