నాలుగు క్రస్టుగేట్ల ద్వారా నీటివిడుదల


Thu,October 10, 2019 03:06 AM

నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో ఎన్నెస్పీ అధికారులు డ్యాం నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుగుణంగా అవుట్‌ఫ్లో ఉండగా ప్రాజెక్టు నీటిమట్టం స్థిరంగా ఉంది. కృష్ణా పరివాహ ప్రాంతాల నుంచి శ్రీశైల ప్రాజెక్టుకు 79,801 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతండగా ఆ ప్రాజెక్టు ఒక క్రస్ట్‌గేటును ఎత్తడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 88,897 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునాసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లను 5 అడుగులు, మరో 2 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి మొత్తం 46226 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, కాల్వల ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది.

పూర్తిగా నిండిన సాగర్ ప్రాజెక్టు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో ప్రస్తుతం 590 అడుగులకు చేరుకొని 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయం ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,561 క్యూసెక్కులు, 4 క్రస్ట్ గేట్ల ద్వారా 46,226క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9800 క్యూసెక్కులు, డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఎడమకాల్వ, ఎస్‌ఎల్‌బీసీకి నీటిని విడుదల చేయడం లేదు. రిజర్వాయర్ నుంచి మొత్తం 88,897 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 884.90 అడుగుల వద్ద 215.3263 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంలోకి ఎగువ నుంచి 79801 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...