ప్రయాణం సాఫీగా...


Tue,October 8, 2019 03:19 AM

-3వ రోజు 283 బస్సులు నడిపిన ఆర్టీసీ అధికారులు
-డిపోల ఎదుట పోలీసుల బందోబస్తు

నల్లగొండసిటీ : ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో 3వ రోజు సోమవారం ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు 283 బస్సులు నడపడంతో సుమారు 40వేలమంది ప్రయాణికులు బస్సుల్లో సాఫీగా ప్రయాణం చేశారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు చేపట్టి తాత్కాలిక సిబ్బంది నియామకాలు కొనసాగించారు. బస్టాండ్‌లో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆర్టీసీ అధికారులు బస్సులను ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అనుగుణంగా నడిపారు. బస్సులు అధికమొత్తంలో నడుస్తుండటంతో ప్రయాణికుల రద్దీ కూడా అదేవిధంగా పెరిగింది. ఎక్కువగా హైదరాబాద్‌కు అధికమొత్తంలో బస్సులు నడిపారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుస్తుండటంతో ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు తరలివెళ్లారు.

283 బస్సులు నడిపిన ఆర్టీసీ...
3వ రోజు జిల్లా అధికారులు మొత్తం 4 డిపోల నుంచి 283 బస్సులను నడిపించారు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో రెండోరోజు కంటే అదనంగా బస్సులు నడిపించారు. 171 ఆర్టీసీ బస్సులతోపాటు 112 ప్రయివేటు బస్సులు నడిపించారు. ఉదయం 4గంటల నుంచి హైదరాబాద్, దేవరకొండ, సూర్యాపేట బస్సులను అందుబాటులో ఉంచి ప్రయాణికులకు సేవలు అందించారు.

వివిధ డిపోల నుంచి బయల్దేరిన బస్సులు..
3వ రోజు దేవరకొండ డిపో నుంచి 39 ఆర్టీసీ, 28ప్రయివేటు బస్సులు, నల్లగొండ డిపో నుంచి 48ఆర్టీసీ, 34 ప్రయివేటు, నార్కట్‌పల్లి డిపో నుంచి 21 ఆర్టీసీ, 14 ప్రయివేటు, మిర్యాలగూడ డిపో నుంచి 43 ఆర్టీసీ, 36 ప్రయివేటు బస్సులను అధికారులు నడిపారు.

కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు....
ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ఆర్టీసీ డిపోలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తును ఏర్పాటుచేశారు. 3వ రోజు కూడా డిపోలో బందోబస్తు నిర్వహించి బస్సులకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసులు ముందుండి నడిపారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...