నూతన కానిస్టేబుళ్లు ఈనెల 10న హాజరుకావాలి


Tue,October 8, 2019 03:18 AM

-అన్ని సర్టిఫికెట్లు వెంటతేవాలి : ఎస్పీ రంగనాథ్
నల్లగొండసిటీ : కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులంతా ఈనెల 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని ఎస్పీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1954మంది ఎంపికైన అభ్యర్థుల్లో 1087మంది జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉండగా 867మంది సూర్యాపేట జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉన్నారన్నారు. వీరంతా ఈనెల 10న ఉదయం 9గంటలకు తమ విద్యార్హత పత్రాలు, స్టడీ, కండెక్టు, కమ్యూనిటీ, నాన్, క్రిమిలేయర్ స్పెషల్ కేటగిరి, క్రీడ, ఎన్‌సీసీ, సీపీపీ, పీఈసీ, హెచ్‌జీ అన్ని సర్టిఫికెట్లతోపాటు ఆధార్‌కార్డులతో స్వయంగా రావాలన్నారు. సర్టిఫికెట్లను సెట్‌గా చేసి సంతకంచేసి ఆ కాపీని అందజేయాలన్నారు. అదేరోజు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామన్నారు. హాజరైన అభ్యర్థుల అన్ని సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 18వ తేదీ నుంచి 28వరకు వైద్య పరీక్షలు చేస్తామన్నారు. జిల్లా అభ్యర్థులకు నల్లగొండలో, సూర్యాపేట వారికి ఆ జిల్లాకేంద్రంలో నిర్ణయించిన తేదీల ప్రకారం వైద్యపరీక్షలు చేస్తామన్నారు. దీనికోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసామన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...