సమస్యలను పరిష్కరిస్తాం


Tue,October 8, 2019 03:18 AM

నల్లగొండసిటీ: గ్రీవెన్స్‌లో వచ్చే ప్రతీ ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు ప్రజల్లో పోలీస్ శాఖ గౌరవం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా అదనపు ఎస్పీ పద్మనాభరెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పలువురు బాధితులు ఫోన్ ద్వారా సమస్యలను వివరించడంతో ఏఎస్పీ స్పందించి న్యా యం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్‌డేలో స్వీకరిస్తున్న ఫిర్యాదులన్నింటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. పోలీసుల పని విధానంలో మార్పు తీసుకొస్తూ ప్రజలకు సమర్థమైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...