ఓటరు సవరణ పారదర్శకంగా నిర్వహించాలి


Tue,October 8, 2019 03:18 AM

నల్లగొండ రూరల్: బూత్ లెవల్ అధికారులు ఓటరు సవరణను పారదర్శకంగా నిర్వహించాలని జేసీ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో నల్లగొండ మండల బూ త్‌లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లకు ఓటర్ సవరణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమన్నారు. ఓటర్ నమోదులో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలన్నారు. ఈనెల 9,10,11తేదీల్లో గ్రామాల్లో డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించి ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజల నుంచి వివరాలను సేకరించి తప్పులు దొర్లకుండా డాటా ఎంట్రీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ దామోదర్‌రావు, డీటీ రం గారావు, ఆర్‌ఐ అమరనాథ్‌రెడ్డి, అధికారులు హు స్సేన్, కుమార్‌రె డ్డి,నల్లగొండ మండల బీఎల్‌ఓ లు, సూపర్‌వైజ ర్లు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...