ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రబావం కనిపించలేదు


Mon,October 7, 2019 02:44 AM

-తాత్కాలిక
-అందుబాటులో ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు
-ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు

నల్లగొండసిటీ : జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రబావం కనిపించలేదు. సమ్మె నేపథ్యంలో రెండో రోజు ఆదివారం ఉదయం నుంచే ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపించారు. జిల్లాలోని నల్లగొండతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి డిపోలుండగా నాలుగు డిపోల్లోను బస్సులు నడిచాయి. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిపడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. తాత్కాలిక పద్ధతిలో తీసుకున్న డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా ఆర్టీసీ బస్సులను నడిపారు. ఆర్టీసీ బస్సులతోపాటు అద్దె బస్‌లు ట్యాక్సీ వాహనాలు నడవడంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులుపడలేదు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీస్, ఆర్టీసీ, ఆర్టీఓ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు రవాణ పరమైన ఇబ్బందులు లేకుండా బస్సులు నడిపారు.

పకడ్బందీ ప్రణాళిక...
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అధికారులు ప్రణాళికలు తయారుచేసి విజయవంతంగా అమలుచేశారు. ఉదయం నుంచి అధికారులు, సిబ్బంది బస్టాండ్ చేరుకుని బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నారు. శనివారం నియమించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఉదయం 5గంటలకు బస్టాండ్ చేరడంతో వారి ద్వారా అధికారులు బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ప్రయాణికుల ఇబ్బందులు లేకుండా అధికారులు చొరవ చూపారు.

ఆయా డిపోల నుంచి కదిలిన బస్సులు..
నల్లగొండ డిపో నుంచి 32ఆర్టీసీ బస్సులతోపాటు 34ప్రయివేటు బస్‌లు మిర్యాలగూడ డిపో నుంచి 40ఆర్టీసీ బస్సులు, 36 ప్రయివేటు బస్సులు, దేవరకొండ డిపో నుంచి 35 ఆర్టీసి బస్సులు, 28 ప్రయివేటు బస్సులు, నార్కట్‌పల్లి డిపో నుంచి 39 ఆర్టీసీ, 14 ప్రైవేట్ బస్సులు తిప్పారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 258 బస్సులను అధికారులు నడపడంతో ప్రయాణికులు సాఫీగా ప్రయాణం సాగించారు.

80వేల మంది ప్రయాణికుల తరలింపు..
ఆదివారం జిల్లాలోని 4డిపోల నుంచి సుమారు 70నుంచి 80వేల మంది ప్రయాణికులను ఆయా గమ్యస్థానాలకు తరలించినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. రెండోరోజు ప్రశాతంగా బస్సులు నడవడంతో అటు అధికారులు, ఇటు పోలీసులు సంతోషం వ్యక్తంచేశారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...