రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


Mon,October 7, 2019 02:43 AM

హాలియా, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను దవాఖానకు తరలించి వారిని ప్రాణాపాయ స్థితినుంచి కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. వివరాలల్లోకి వెళితే అనుముల మండలం ఇబ్రహీంపేట అచ్చిరెడ్డి మిల్లు సమీపంలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో నిడమనూరు మండలం బాపణగూడెం గ్రామానికి చెందిన సైదులుతోపాటు మరో వ్యకి తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డుపై క్షతగాత్రులను బలమైన గాయాలతో రక్తమోడుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే నోముల నిడమనూరు నుంచి హాలియాకు తన వాహనంలో వస్తున్నారు. ప్రమాద స్థలం వద్దకు రాగానే ఎమెల్యే తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులను పరామర్శించారు. 108, పోలీసులకు ఫోన్‌లో స మాచారం అందించారు. 108వాహనం రావ డం ఆలస్యం కావడంతో సకాలంలో అక్కడికి వ చ్చిన పోలీసు జీపులో క్షతగాత్రులిద్దరిని ఎమ్మె ల్యే తన గన్‌మెన్ల సాయంతో వైద్య చికిత్స నిమి త్తం హాలియాలోని దవాఖానకు తరలించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరిని సకాలంలో దవాఖానకు తరలించి వారి ప్రాణాలను కాపాడిన ఎమ్మె ల్యే నోములకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...