సినీ ఫక్కీలో చోరీ


Mon,October 7, 2019 02:41 AM

కోదాడ రూరల్ : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసముంటున్న కట్టా సతీష్‌కుమార్ పట్టణంలో కామదేను స్టీల్ సిండికేట్ దుకాణ యాజమాని. శనివారం దసరా పండుగ సెలవుల సందర్బంగా కూతురు, భార్య, అత్తతో కలిసి తన సొంత ఊరు మునగాల మండలం కొక్కిరేణికి వెళ్లాడు. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్‌తో ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఇంటి వెనుక తలుపు తెరిచి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో బీరువాలోని రూ.20వేలు నగదు, రూ.50వేలు విలువ చేసే డాలర్లు, బంగారు కడియం, దిద్దులు, వెండి పట్టీలు, సీసీ కెమెరా, 40చీరెలు దొంగలు తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం ఇంటిలో పనిమనిషి ఇంటి చుట్టూ ఊడ్చి ఇంట్లో వారు లేకపోవడంతో వారిని పిలుస్తున్న సమయంలో పక్కన ఇంటి యాజమాని కిరణ్ వారు ఊరికి పోయారని చెప్పడంతో ఇంటివెనుక తలుపు తెరిచి ఉందని చెప్పి లోనకు పోయి చూడగా బీరువా తెరిచి ఉండడంతో విషయాన్ని యాజమానికి ఫోన్ ద్వారా తెలిపారు. యజమాని ఫిర్యాదు మేరకు నల్లగొండ నుంచి క్లూస్‌టీం వచ్చి ఇంట్లోని ఫింగర్ ప్రింట్‌ను సేకరించారు. చోరి సమయంలో దొంగలను గుర్తించకుండా ఉండేందుకు వారు ఇంట్లోని సీసీ కెమెరా సిస్టంలో దొంగలు హార్డుడిస్కును తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ వై.ప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్ననట్లు తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...