రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Mon,October 7, 2019 02:41 AM

నిడమనూరు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నా రు. మండలంలోని జూలకంటి వారిగూడెం వద్ద వరద కాల్వకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారం తో నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. వరదకాల్వ మో టార్ల ద్వారా శనగకుంట చెరువులోకి నీటిని ఎత్తిపోయ డం ద్వారా సుమారు 200ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. దాతల సహకారంతో రూ.15లక్షల వ్యయంతో రైతు ప్రయోజనాల పరిరక్షణ కోసం మినీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం అభినందనీయమన్నా రు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న వరద కాల్వ ను పూర్తి చేసి చెరువులు నింపిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతులు పోలీసుల చేయూతతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓ రైతుకు చెందిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇచ్చామని నూతనంగా ట్రా న్స్‌ఫార్మర్ మంజూరు చేయాలని రైతులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సహకారంతో ఎర్రగూడెం, ఎర్రబెల్లి గ్రామాలకు 63 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుకు హామీ ఇచ్చారు.

నెల్లికల్‌లో వరద కాల్వ వద్ద ఎత్తిపోతల పథకానికి పోలీసులు సహకరించాలని కోరారు. మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలను చైతన్యం చేసిందని, ప్రభుత్వ స్ఫూర్తితోనే మినీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని తెలిపారు. అనంతరం రైతులు ఎమ్మెల్యే నర్సింహయ్య, డీఎస్పీ శ్రీనివాస్, సీ.ఐ. ధనుంజయగౌడ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో హాలియా సీఐ, చంద్రశేఖర్, ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు నందికొండ రామేశ్వరి, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నూకల వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు కేవీ రామారావు, బొల్లం రవియాదవ్, పగిళ్ల సైదులు, నాయబ్ తహసీల్దార్ రషీద్, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, ఎర్రబెల్లి, వేంపాడ్ సర్పంచ్‌లు అలుగుబెల్లి మమత, అర్వ స్వాతి, నాయకులు తాటి సత్యపాల్, అలుగుబెల్లి కోటిరెడ్డి, మన్నెం వెంకన్నయాదవ్, సురుగురు శ్రీనివాస్‌రెడ్డి, జూలకంటి అశోక్‌రెడ్డి తదితరులున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...