తెలంగాణ జాతి ఆస్తి..బతుకమ్మ పండుగ


Mon,October 7, 2019 02:41 AM

సూర్యాపేట టౌన్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ తెలంగాణ జాతి ఆస్తి అని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని పండుగలు ప్రశాంత వాతావరంలో జరుపుకుంటున్నామని, బతుకమ్మతోపాటు సంప్రదాయ పండుగలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకున్న సద్దుల చెరువు వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొని ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబం అని, వేల జాతులు ఒడిసిపోయినా మూడున్నర వేల జాతులను నిలబెట్టిన ఘనత ఈ బతుకమ్మ పండుగదే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించామని, దేశ విదేశాల్లో నేడు ఈ పండుగను మన తెలుగువారితోపాటు పలు దేశాల మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారన్నారు.

మహిళల ఆనందమే తమకు ప్రధానమని, వారికి బతుకమ్మ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకే నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్న డీసీఎంఎస్ గోదామును తొలగించి బతుకమ్మ వేదికను విశాలంగా విస్తరించామన్నారు. దీంతో ఈ ఏడాది మహిళలు సువిశాల ప్రదేశంలో మరింత ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారన్నారు. వచ్చే ఏడాది నాటికి మరిన్ని సౌకర్యాలతో బతుకమ్మ వేదికను సువిశాలంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మలతో కలిసి చిన్నారులు, యువతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా మంత్రితో సెల్ఫీలు దిగారు. వేడుకల్లో ఎంపీ బడుగుల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల, జడ్పీ వైస్‌చైర్మన్ గోపగాని, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, పెద్ద ఎత్తున మహిళలతోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...