వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుడి నిత్యకల్యాణం


Mon,October 7, 2019 02:40 AM

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి నిత్యకల్యాణోత్సవం ఆలయ అర్చకులచే ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీ లక్ష్మీనృసింహస్వామి అమ్మవార్లకు నిత్యకల్యాణోత్సవంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరనం, పంచగవ్యప్రాసన ని ర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి మాంగళ్యధారణ తలంబ్రాలతో నిత్యకల్యాణతంతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్, కార్యనిర్వాహణాధికారి ఉదయభాస్కర్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...