బాలుడు అనుమానాస్పద మృతి


Sun,October 6, 2019 01:40 AM

మర్రిగూడ : బాలుడు(2నెలల) అనుమా నాస్పదంగా మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్‌నారాయణపురం మండలం వాయిల్లపల్లి పంచాయతీ ఆవాసం గొల్లగూడేనికి చెందిన వంగూరి మల్లేష్, రోజా దంపతులకు (విఘ్నేష్) మొదటి సంతానం. దసరా పండుగ నేపధ్యంలో రోజా బాబుతో తల్లిగారి ఊరైన మండలంలోని శివన్నగూడెం గ్రామానికి వచ్చింది. నెలవారీ టీకాలు వేయించేందుకు బాబును శివన్నగూడెం సబ్‌సెంటర్ పరిధిలోని రాంరెడ్డిపల్లికి తీసురాగా వైద్యసిబ్బం ది మధ్యాహ్నం పోలియో చుక్కలు, పెంటావాలెంట్, రోటా వ్యాక్సిన్ వేశారు. అప్పటి నుంచి బాబు శరీరం చల్లబడి నీరసంగా ఉండడంతో సాయంత్రం దవాఖానకు తీసుకొచ్చినట్లు తెలిపారు. డాక్టర్ పరీక్షించిన కాసేపటికే బాబు మృతి చెందినట్లు తెలిపారు. టీకాలు వికటించడం వల్లే కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యా రు. విషయం తెలుసుకున్న పోలీసులు దవాఖానకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయంపై వైద్యాధికారి రాజేష్‌ను వివరణ కోరగా బాబుకు టీకాలు వేసింది వాస్తవమేనని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...