గుట్కాలు విక్రయిస్తున్న 13మంది అరెస్టు


Sun,October 6, 2019 01:39 AM

నల్లగొండసిటీ : జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గుట్కా లు విక్రయిస్తున్న 13మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4లక్షల విలువైన గుట్కా, ఖైనీ, తంబాకు ప్యాకెట్లు, ఆటో, 12సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ సురేష్ శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణానికి చెందిన బుర్ర లింగయ్య తన సోదరుడు శేఖర్‌తోపాటు ఈర్లపాటి మల్లికార్జున్ అతడి తమ్ముడు యాదగిరి హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి గుట్కాలను తీసుకొచ్చి పట్టణంలో కిరాణషాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకొని సుమారు రూ.2లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టణంలో కిరాణ, పాన్‌షాపులు నడుపుతున్న పోలా లక్ష్మీనర్సయ్య, తుమ్మలపల్లి వినోద్, ఓరుగంటి మధుసూదన్, అదిల్, ఇంద్రీస్, దార నర్సింహ, మీలా వెంకటేశ్వర్లు షావాజ్, వాజిద్, కొండ శ్రీనులకు సరఫరా చేస్తున్నట్లు చెప్పడంతో షాపులపై దాడి చేసి రూ.2లక్షలు విలువైన సరు కు స్వాధీనం చేసుకుకొని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి వీరిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుట్కా దందాకు చెక్‌పెట్టిన ఎస్‌ఐ గోపాలరావు, సిబ్బంది రాము, షకీల్, ఏఎస్‌ఐ వెంకన్న, జానారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి, రైటర్లు ఆంజనేయులు, శ్రీనివాస్, కిరణ్‌లను డీఎస్పీ రంగారావు అభినందించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...