ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగొద్దు


Sun,October 6, 2019 01:38 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఈ ఏడాది వానాకాల సీజన్‌లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 70 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర అందించాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం వస్తే కొనుగోలు చేయోద్దని, ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. 70 కేంద్రాల ద్వారా 3.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, డీసీఓ శ్రీనివాసమూర్తి, డీఎస్‌ఓ రుక్మిణిదేవి, డీఎం సివిల్ సప్లయ్ నాగేశ్వర్‌రావు, ఏసీఎస్‌ఓ నిత్యానంద్, మార్కెటింగ్ ఏడీ అలీం, అగ్రికల్చర్ జేడీఏ సుజాత తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...