కేటీఆర్‌ను విమర్శించే స్థాయి ఉత్తమ్‌కు లేదు


Sun,October 6, 2019 01:38 AM

-ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
హుజూర్‌నగర్‌రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్ర్టాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసున్న మంత్రి కేటీఆర్‌ను విమర్శించేస్థాయి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ రోడ్ షో తర్వాత కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఉప ఎన్నికల్లో ఇక సైదిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు. సమావేశంలో జడ్సీటీసీ సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...