తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే


Sun,October 6, 2019 01:38 AM

-గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
పాలకవీడు : తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి లంబాడీల చిరకాల కలను నెరవేర్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్యపహాడ్, కల్మటితండా, కొత్తతండా, దేవ్లాతండా, చెర్వుతండా, మీగడంపహాడ్‌తండాల్లో ఎంపీ మాలోతు కవిత, టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి ఆమె సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు గత ప్రభుత్వాలు లంబాడీలను ఓటు బ్యాంక్‌గా వినియోగించుకొన్నాయే తప్ప ఏనాడు గౌరవించలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మహిళా మంత్రిగా లంబాడీ బిడ్డనైన తనను నియమించారన్నారు. పాలకవీడు మండలంలో మూసీ, కృష్ణా నదులపై లిఫ్ట్‌ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పోడు భూములలలో సాగు చేసుకొంటున్న గిరిజనులకు ఆర్వోఆర్ పట్టాలను అందచేస్తామని, రైతుబందు పథకం వర్తింపజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనగామ జడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి రమణానాయక్, స్కైలాబ్‌నాయక్, టీఆర్‌ఎస్ మండల నాయకులు మలిమంటి దర్గారావు, ఉద్యానాయక్, హర్యానాయక్, చరణ్‌నాయక్, రాజశేఖర్‌నాయక్, నరీనాయక్, రాంచదర్‌నాయక్, భూక్యా రవి, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, కిష్టపాటి అంజిరెడ్డి, ఎరెడ్ల సత్యనారాయణరెడ్డి, తాటికొండ వెంకట్‌రెడ్డి, పసుపులేటి సైదులు, భూక్యా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...