అవగాహన కల్పించాలి


Sat,October 5, 2019 03:38 AM

నీలగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా, రైతు బంధు పథకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిలు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 6వ స్థాయీ సంఘం సమావేశం చైర్మన్ నారబోయిన స్వరూపారాణి, 3వ స్థాయీ సంఘం సమావేశం వైస్ చైర్మన్ ఇరుగు పెద్దులు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చారన్నారు. రైతులు నిరక్షరాస్యులు కావడంతో వీటిపై కనీస అవగాహన లేదని, చైతన్యం తీసుకురావాలని సూచించారు. జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీగంధంపై రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, టెక్నాలజీ డెవలప్‌మెంట్ అయినా వ్యవసాయ రంగంలో వెనుకబడి పోతున్నామని.. మెరుగైన అభివృద్ధ్ది సాధించేందుకు అధికారులంతా కృషి చేయాలన్నారు. సేంద్రీ య వ్యవసాయ పద్ధతులకు సంబంధించి మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో జరిగే సమావేశాల్లో విస్తరణ అధికారులు పాల్గొని ప్రజాప్రతినిధులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కొత్త రేషన్ దుకాణాలు మంజూ రు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు మెడికల్ చెకప్‌లు చేయాలని, మూసీ గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయల కల్పనకు ప్రభు త్వం రూ.19కోట్లు మంజూరు చేసిందని, వాటిని ప్రగతిలో పెట్టాలన్నారు. 6వ స్థాయీ సంఘం చైర్మన్ స్వరూపారాణి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు చాలా ఆద్వాన్నంగా మారాయని, విద్యార్థ్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. త్వరలో అంగన్‌వాడీ కేం ద్రాల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మాట్లాడుతూ ప్రస్తుతం చండూరు మండల కేంద్రం మున్సిపాలిటీ అయినందున గ్యాస్ డీలర్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సుమారు 11 వేల కనెక్షన్లు ఉన్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. త్రిపురారం జడ్పీటీసీ ధనావత్ భారతి మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత ఉందని దీన్ని అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...