అధికారులపై చైర్మన్ ఆగ్రహం


Sat,October 5, 2019 03:38 AM

జిల్లా పరిషత్, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు అధికారులు రాకపోవడంపై చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల శాఖకు సంబంధించి అధికారులు రాకపోవడం ఏమిటని పీడీ సుభద్రను ప్రశ్నించారు. సమావేశానికి హాజరు కాకపోగా.. తప్పుడు నివేదికలతో హాజరు కావడం ఎంతవరకు సమంజసమన్నారు. కింది స్థాయి అధికారులను పం పడం వల్ల వారికి పూర్తి అవగాహన లేక సభ్యులకు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. వచ్చే సమావేశాలన్నింటికీ అధికారులు సమయానికి హాజరు కావాలని.. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, పీఏపల్లి జడ్పీటీసీ అలుగుబెల్లి శోభారాణి, కో అప్షన్ సభ్యులు మోసిన్ అలీ, సీఈఓ కె. వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈఓ సీతాకుమారి, వ్యవసాయాధికారి సుజాత, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి, పౌర సరఫరాల శాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...