తండ్రిని కడతేర్చిన తనయుడు


Sat,October 5, 2019 03:37 AM

నల్లగొండ సిటీ : మద్యం మత్తులో తండ్రిని రోకలిబండతో కొట్టి తనయుడే దారుణంగా హత్యమార్చిన ఘటన జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. వన్‌టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాలివి.. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పెరుమాళ్ల గోవర్ధన్(65) మేస్త్రీ పని చేస్తూ ఏడాదిగా నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈయనకు కుమార్తె, కుమారుడున్నారు. ఆరేండ్ల క్రితం కుమార్తెకు వివాహమైంది. పదేళ్ల క్రితమే భార్య మృతి చెందడంతో నాటి నుంచి కుమారుడు సతీష్ నాంపల్లిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఏడాదిగా క్రితం తండ్రి వద్దకు వచ్చాడు. గోవర్ధన్ మేస్రీ పని చేస్తుండగా సతీష్ మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి టీవీ చూసే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. మద్యం మత్తులో ఉన్న సతీష్ నన్ను టీవి చూడనీయవా.? అంటూ రోకలబండతో టీవీ పగులగొట్టాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన నరేష్ అదే రోకలిబండతో తండ్రి తలపై కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమై ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కాసేపటికి తేరుకొని నేరుగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతుడి కూతుర్తె జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ పేర్కొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...