రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం


Sat,October 5, 2019 03:37 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం దేవరకొండలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 50శాతం, ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 10శాతం, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ల పెంపుకోసం తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని వర్గాలను సంఘటితం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచాలని, దీనిపై త్వరలోనే ఐక్య కార్యచరణను ప్రకటిస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, నియోజకవర్గ ఇన్‌చార్జి చిరంజీవి, నాగిళ్ల రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...