గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి


Fri,October 4, 2019 01:51 AM

-ప్రతి ఇంట్లో 6 మొక్కలు నాటాలి
-కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్
-మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది..
-సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య

తిరుమలగిరి (సాగర్) : గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై రూపురేఖలు మార్చుకోవాలనే సీఎం కేసీఆర్ 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. గురువారం అనుముల మండలంలోని హజారిగూడెం గ్రామంలో 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నూతన పాలకవర్గంతో పాటు, స్టాండింగ్ కమిటీ, కో ఆప్షన్ సభ్యులు గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళిక, పంచ వార్షిక ప్రణాళికను సైతం రూపొందించుకొని ఆ దిశగా అభివృద్ధికి ముందడుగు వేయాలని సూచించారు. 33శాతం అటవీ భూములుండాలని కానీ గ్రామంలో మాత్రం 10 శాతం అటవీ భూములున్నాయని అందుకు ప్రతీ కుటుం బం సుమారు 6 మొక్కలు నాటి అడవుల పెంపకానికి దోహదపడాలన్నారు. వీధుల్లో ఎల్‌ఈడీ బల్బులు, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, చెత్తకుండీలకు గాను సిమెంటు గునలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధిహామీ నిధుల నుంచి ధ్మశాన వాటికకు రూ.10లక్షలు, డంపింగ్‌యార్డుకు రూ.4.5లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామంలో భూ పాసుపుస్తకాలు, రైతుబంధు అందరికీ చేరువయ్యేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో నూతనంగా ప్రభుత్వ కార్యాలయాలకు రూపకల్పనకు నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్లే జీవనాధారని, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. హజారిగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చిన బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. అంతకుముందు హాలియాలో నిర్మించబోయే మినీ స్టేడియం, కూరగాయల మార్కెట్‌కు సంబంధించిన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ పేర్ల సుమతిపురుషోత్తం, తహసీల్దార్ డప్పు రత్నం, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంఎస్‌ఓ వెంకటేశ్వర్లు, విద్యుత్ ఏఈ శ్రీను, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నరేష్, స్థానిక సర్పంచ్ వద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ రావుల రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు దస్తగిరి, వెంకట్‌రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ అధికారి మానస, ఉప సర్పంచ్ జబీన్, నోడల్ అధికారి కళావతి, గిర్దావర్ సుస్మిత, పంచాయతీ కార్యదర్శి గిరి, నాయకులు ఎన్నమల్ల సత్యం పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...