రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్రగాయాలు


Fri,October 4, 2019 01:49 AM

కేతేపల్లి : బైక్ అదుపుతప్పి వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మండ ల కేంద్రంలో నిమ్మలమ్మ చెరువు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలివి.. గుంటూరు జిల్లాకు చెందిన వేముల జీవన్‌కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడ బైక్‌పై వెళ్తున్నాడు. కేతేపల్లి వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డు వెంట ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో జీవన్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఆర్తనాదాలు చేస్తుండగా అదేసమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప గుర్తించి వాహనం నిలిపి అటు వైపు వెళ్తున్న వారి సాయంతో 1033 వాహనంలో చికిత్స నిమిత్తం నల్లగొండ దవాఖానకు తరలించారు. విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఆటో బోల్తా : డ్రైవర్‌కు తీవ్రగాయాలు
కోదాడ రూరల్ : ఆటో బోల్తాపడి డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కోమరబండ శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి జరిగింది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన తైదాల సుబ్బారావు ఆటోడ్రైవర్. బుధవారం కోదాడ నుంచి హైదాబాద్‌కు లోడ్‌తో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండలంలోని కోమరబండ శివారు వై -జంక్షన్ వద్ద నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా పడింది. స్థానికులు 108వాహనానికి సమాచారం అందించడంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ప్రభుత్వ దవాఖానకు తరలించి ఆటో యాజమాని కుమ్మకి గోపికి సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో ఆటో రూ.45వేలు నగదు ఉండగా 108సిబ్బంది సిబ్బంది ఆ మొత్తాన్ని ఆటో యాజమానికి అందించి నిజాయితీ చాటుకున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...