రూ. 18.39లక్షల నగదు స్వాధీనం


Fri,October 4, 2019 01:49 AM

సూర్యాపేట రూరల్/కోదాడ రూరల్/ నూతనకల్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామం స్టేజీ చెక్‌పోస్టు వద్ద, కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద, నూతనకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద గురు వారం నిర్వహించిన తనిఖీల్లో రూ.18లక్షల 39వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టేకుమట్ల స్టేజీ వద్ద సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో మాదాపూర్ నుంచి విజయ వాడకు వెళ్తున్న సోమారపు మల్లేష్ నుంచి రూ. 4లక్షల 50వేలు, దేవ గుప్త సత్యనారా యణ నుంచి రూ.లక్ష, ఎస్.రాజు నుంచి రూ. 70వేలు, మధుబాబు నుంచి రూ. 50వేలు స్వాధీనం చేసుకొని ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు ఇన్‌చార్జ్‌కి అప్పగిం చారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో తనిఖీ కేంద్రం వద్ద విజయవాడకు చెందిన తమ్మి నేని రాజశేఖర్ కారులో రూ.8.5 లక్షలు గుర్తించి స్వాధీనం చేసు కున్నారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించక పోవడంతో స్వాధీనం చేసుకున్నారు. నూతనకల్ చెక్‌పోస్టు వద్ద జనగామా జిల్లా తొర్రూర్ పట్టణానికి చెందిన సత్యనారాయణ విజయవాడ వైపు వెళ్తుండగా కారులో రూ.3లక్షల 19వేలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదును తహసీల్దార్ మంగ పరిశీలించారు. నగదుకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో సీజ్ చేసి తహసీల్దార్ సమక్షంలో జిల్లా ట్రెజరీ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...