సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్


Fri,October 4, 2019 01:49 AM

పెద్దవూర : 30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రా మాల అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కా వాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. గురువారం మండలంలోని పర్వేదుల, పాల్తీతండా గ్రామ పంచాయతీల్లో 30రోజుల ప్రణాళిక పనులను ఆయ న ఆకస్మికంగా తనిఖీ చే శారు. అనంతరం జరిగిన గ్రామసభలో ఆయన గ్రా మంలో తాగునీరు, డ్రైనే జీ, విద్యుత్, రెవెన్యూ, వృద్ధాప్య, వితంతు పిం ఛన్ల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సా రించాలని ఆదేశించారు. గ్రామంలోని అంగన్‌వా డీ, పాఠశాల ప్రహరీ, పా ల్తీతండాలోని బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు వినతి పత్రాలు అందజేయగా, స్పందించిన కలెక్టర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నా రు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ చెన్ను అనురాధ, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణస్వామి, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఎంఈఓ తరి రాము, సీడీపీఓ గంధం పద్మవతి, ట్రాన్స్‌కోఏఈ దాసయ్య, సర్పంచ్ దండ మనోహర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గుంటక వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ఆడెపు రామలింగయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గజ్జెల లింగారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు బషీర్, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండలాధ్యక్షుడు ఢాకునాయక్, సర్పంచ్‌లు చంద్యానాయక్, చామకూరి లింగారెడ్డి, రావులశ్రీను, బాణావత్ శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకుడు చెన్ను సుందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రవినాయక్ పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...