నాగార్జునసాగర్ క్రస్టుగేట్ల మూసివేత


Fri,October 4, 2019 01:48 AM

నందికొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్టుగేట్లను గురువారం సాయంత్రం ఎన్నెస్పీ అధికారులు పూర్తిగా మూసివేశారు. ఉదయం నుంచి రెండు క్రస్టుగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయగా.. రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లను పూర్తిగా మూసివేశారు. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి 50,001క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 589.70 అడుగుల వద్ద 311.1480 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయం ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,292 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 5018 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 8981 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, డీటీ గేట్ల (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. మొత్తం 50,001 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 884.10 అడుగుల వద్ద 210.5133 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 45,014 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...