ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు


Thu,October 3, 2019 01:47 AM

-అక్టోబర్ మూడో వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభం
-ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 70 కేంద్రాలు
-3.25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
-క్వింటా ఏగ్రేడ్ రూ.1835, సాధారణ రకం రూ.1815
-గతేడాది కంటే 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పెంపు

నల్లగొండ, నమస్తేతెలంగాణ : అన్నదాతకు ఆసరాగా ఉం డేందుకు అనేక సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ల లో మద్దతు ధరను అందజేస్తూ ధాన్యాన్ని కొనుగోలు చే స్తోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి మి ల్లింగ్ చేసిన అనంతరం స్వీకరించి వాటిని జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల కు సరఫరా చేస్తు పిల్లలకు సన్న బియ్యాన్ని పెడుతోంది. అం దులో భాగంగానే ఈఏడాది వానాకాలం సీజన్‌లో సన్న ధా న్యం రైతులు ఎక్కువగా పండించనున్న నేపథ్యంలో క్వింటా కు ఏ గ్రేడ్ అయితే రూ.1,835, సాధారణ రకమైతే రూ. 1,815 చెల్లించేందుకు నిర్ణయించి వచ్చే నెల 15 తర్వాత జిల్లా వ్యా ప్తంగా 70 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

అక్టోబర్ 15 తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ 15 తర్వాత కొనుగోళ్లు చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా కేంద్రాల్లో ఈ కొనుగోళ్లను చేపట్టనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 40 ఐకేపీ కేంద్రాలు, సహకారశాఖ ఆధ్వర్యంలో 30పీఏసీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతా ల్లో ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని సమీప గ్రామాల నిడివిని పరిశీలిస్తూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రాల ఏర్పాటుపై శుక్రవారం జేసీ చంద్రశేఖర్ సంబంధిత శాఖల అధికార యంత్రాంగంతో సమీక్షించారు. అక్టోబర్ 15 తర్వాత ధాన్యం ఉత్పత్తిని బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేయనున్నారు.

పెరిగిన మద్దతు ధర..
ప్రతి సంవత్సరం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరను అందజేస్తూ కొనుగోలు చేపడుతున్న ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లోను కొనుగోలు చేపట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 70 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా ఆయా కేంద్రాలలో ఈ మద్దతు ధర ఇవ్వనున్నారు. గత సంవత్సరం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1770 చెల్లించగా ఈసారి రూ.65 పెంచి రూ.1835గా నిర్ణయంచారు. అదేవిధంగా సాధారణ రకం ధాన్యానికి గత సంవత్సరం రూ.1750 ఇవ్వగా క్వింటాకు ఈ ఏడాది రూ. 1815 చెల్లించనున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో గుర్తించిన మిల్లులకు పంపించిన అనంతరం సివిల్ సప్లయ్ ఆధ్వర్యం లో రైతులకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డ బ్బులను చెల్లించనున్నారు. అయితే ఆయా కొనుగోలు కేం ద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు, టార్పాలిన్లు, తేమ యంత్రాలు మార్కెటింగ్‌శాఖ సమకూర్చనుండగా గన్నీబ్యాగ్‌లు, ధాన్యం రవాణ నిర్వహణ సివిల్ సప్లయ్ యంత్రాంగం చేపట్టనుంది.

ఈ ఏడాది పెరుగనున్న ధాన్యం ఉత్పత్తి..
జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం వానాకాలంతో పోలిస్తే ఈసారి ధాన్యం ఉత్పత్తి సుమారు 50వేల మెట్రిక్ టన్నులకు పైగా పెరుగనుంది. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 76వేల హెక్టార్లలో వరి సాగు కాగా 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తయింది. ఈ ఏడాది ఇప్పటికే 90వేల హెక్టార్లకు పైగా వరిసాగు కాగా ఈ వారం రోజుల్లో మరికొంత పెరిగే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ యంత్రాంగం చెబుతోంది. దీని ప్రకారం ఈ సీజన్లో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. అయితే సీజన్ ఆరంభంలో సాగు చేసిన పైరుకు సంబంధించిన ధాన్యం అక్టోబర్‌లో దిగుబడి రానుండగా ప్రస్తుతం సాగు చేస్తున్న పైరుకు సంబంధించిన ధాన్యం మరో నాలుగు నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 వేల హెక్టార్లలో వరి అధిక సాగు కాగా 50వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం దిగుబడి పెరుగనుంది.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...