ఉత్తమ్ అహంకారంతోనే అభివృద్ధి దూరం


Thu,October 3, 2019 01:44 AM

హుజూర్‌నగర్, నమస్తేతెలంగాణ : ఉత్తమ్ అహంకారంతోనే నియోజకవర్గం అభివృద్ధికి నోచలేదని, టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూర్‌నగర్ రూపురేఖలు మారుస్తామని ఉప ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూర్‌నగర్‌కు నిధులు కావాలని ఎన్నడూ సీఎం, మంత్రులను ఉత్తమ్ కలువలేదని, సమీక్షా సమావేశాల్లో పాల్గొనలేదని పేర్కొన్నారు. అయినా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఇచ్చే రూ.3కోట్ల నిధులు ఇచ్చారన్నారు. నాగార్జున సాగర్ డెడ్‌స్టోరేజీలో ఉన్నా సాగర్ ఎడమకాల్వ రైతులకు రెండు పంటలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి రూ.20కోట్ల నిధులు ఇస్తే పనులు కాకుండా ఉత్తమ్ అడ్డుకుంటున్నాడన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూర్‌నగర్ రూపురేఖల్ని మారుస్తామని తెలిపారు. మహిళపై ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్సీలను సీఎం పంపుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి మాట్లాడుతుంటే హాస్యంగా ఉందని, తెలంగాణ అమరవీరుడు తల్లి శంకరమ్మను ఈమె భర్త ఓడించినప్పుడు ఆమె ఓ మహిళ అని పద్మావతికి గుర్తుకు లేదా? అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌లో ఈనెల 4న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నిర్వహించనున్న రోడ్‌షోను విజయవంతం చేయాలని కోరారు. రోడ్‌షో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఉంటుందన్నారు. సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, గంగాధర్‌గౌడ్, జనరల్ సెక్రెటరీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వై.వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి పాల్గొన్నారు.

200మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిక...
హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన సుమారు 200మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉప ఎన్నికల ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, తేజావత్ రవినాయక్, మందా సతీష్, కొత్త నవీన్, పెద్దపంగు దావీద్, సురేష్, హరీశ్, రవి, శ్రీకాంత్, సాయి, ప్రేమ్‌కుమార్, నరేష్, నవీన్, జగువా, ప్రవీణ్, సాయి, రాజు, సత్తి, నాగరాజు, గోపి, అంబేద్కర్, వెంకటేష్ పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...