ప్రగతి మెరిసింద


Thu,September 19, 2019 02:00 AM

-తాళ్లవీరప్పగూడెంలో సమస్యలపై గ్రామస్తుల శంఖారావం
- ఐకమత్యంతో కదిలిన జనం...
- శ్రమదానంతో పారిశుధ్యం, పలు పనులు పూర్తి
-ఒక్క రోజులో కొత్త శోభ.. ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం

దామరచర్ల : ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మా గ్రామాన్ని మేమే బాగు చేసుకుంటామంటూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామస్తులు ముందుకు కదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో గ్రామ ప్రజలు భాగస్వాములవుతున్నారు. యువతీ యువకులు, మహిళలు, నాయకులు, రైతులు అంతా కలిసికట్టుగా స్థానిక సర్పంచ్ బాల సుజాత శ్రీనివాసనాయుడు, ఎంపీటీసీ రాయికింది సైదులు, వార్డుసభ్యులు, నాయకులతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలబెట్టేందుకు నిత్యం కార్యాక్రమాలు చేపడుతున్నారు. బుధవారం కూడా గ్రామంలో శ్రమదానం ద్వారా వివిధ పనులు చేపట్టారు.

ప్రణాళికా బద్ధంగా పనులు
30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా అందరి సమక్షంలో గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించారు. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయమై ప్రణాళికా బంధంగా ముందుకు సాగుతున్నారు. వీటికి తోడు బడ్జెట్‌తో సంబంధం లేకుండా శ్రమదానంతో పరిష్కారమయ్యే సమస్యలను గ్రామస్తులంతా ఐక్యంగా నిర్వహిస్తున్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...