దేవరకొండలో నాలుగు ల్యాబ్‌లు సీజ్


Thu,September 19, 2019 01:57 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం బుధవారం దేవరకొండ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. వివిధ ఆసుపత్రులలోని ల్యాబ్‌లలో తప్పుడు రిపోర్డులు ఇవ్వడం, అర్హతగల డాక్టర్లు, టెక్నీషియన్లు లేకపోవడం, ఒక డాక్టర్ పేరుతో మరో డాక్టర్ విధులు నిర్వహించడం తదితర కారణాల నేపథ్యంలో డీఎంహెచ్‌వో కొండల్‌రావు నాలుగు ల్యాబ్‌లను సీజ్ చేశారు. చేనేత సహకార సంఘం కాంప్లెక్స్‌లో ఉన్న హైటెక్ స్కానింగ్ సెంటర్, శ్రీ వైష్ణవి నర్సింగ్‌హోం నిర్వహిస్తున ల్యాబ్‌ను, జ్యోతి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో నిర్వహిస్తున్న ల్యాబ్‌ను, ఎలాంటి అనుమతులు లేకుండా ఓ స్వీట్ హౌజ్‌లో నిర్వహిస్తున్న శ్రీ బాలాజి డిజిటల్ ఎక్స్‌రే ల్యాబ్‌ను సీజ్ చేశారు. ఒక డాక్టర్ పేరుతో మరో డాక్టర్ నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్‌డిపోకు ఎదురుగా ఉన్న లీలావతి డయాబెటిక్ ఆసుపత్రికి, ల్యాబ్‌కు అనుమతులు తీసుకునేందుకు రెండురోజుల గడువు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో కొండల్‌రావు మాట్లాడుతూ డెంగీ నివారణ పరీక్షలు చేసేందుకు జిల్లాలోని ఏ ప్రైవేటు ఆసుపత్రికి అనుమతులు లేవన్నారు. ప్రస్తుత సీజన్‌లో వస్తున్న వైరల్ జ్వరాలను ఆసరాగా చేసుకున్న పలు ప్రైవేటు ఆసుపత్రులు తప్పుడు రిపోర్టులు ఇవ్వడం, సెల్ఫ్‌గా ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం చేస్తున్నారన్నారు. చాలావరకు ల్యాబ్‌లలో అర్హతగల డాక్టర్లు, రేడియోగ్రాఫర్లు లేరని, కన్సల్టెంట్ డాక్టర్ ఉంటేనే ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. చాలావరకు ల్యాబ్‌లను అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం వచ్చే జ్వరాలన్నీ చాలావరకు వైరల్ జ్వరాలేనని, దీన్ని ఆసరాగా చేసుకొని పలు ఆసుప్రతుల వైద్యులు చెప్పినట్లు యాంటి బయాటిక్ వాడితే ప్లేట్‌లెట్స్ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు వైరల్ జ్వరాలను డెంగీ జ్వరాలుగా భావించి ఆందోళన చెందవద్దని తెలిపారు. తనిఖీబృందంలో వెంకన్న, సుధాకర్ రెడ్డి, కృష్ణయ్య, కృష్ణస్వామిలు పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...