తీరుతున్న కరెంటు సమస్య


Wed,September 18, 2019 02:22 AM

- గ్రామాల్లో విద్యుత్ ప్రణాళిక కార్యాచరణ అమలు
- పాతస్తంభాలు, లైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు
- ఏళ్ల కాలం నాటి సమస్యలకు చెక్
నల్లగొండ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామాలు ప్రగతి దిశగా పరుగులు తీస్తున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను చెక్ పెట్టేందుకు 30 రోజుల ప్రణాళికలో అధికారులు విద్యుత్ లైన్లను సరి చేస్తున్నారు. గతంలో గ్రామాల్లో లూప్‌లైన్లతో పాటు శిథిలావస్థకు చేరిన పోల్స్‌తో విద్యుత్ సమస్యలు ఏర్పడేవి. అలాంటి సమస్యలు రాకుండా ఏళ్ల కాలం నాటి ఇనుప స్తంభాలు గుర్తించి వాటి స్థానంలో కొత్త సిమెంట్ స్తంభాలు అమరుస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో హెవీ స్విచ్‌లు లేకపోవడంతో 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుండేది. దానికి చెక్‌పెట్టేందుకు వీధి దీపాల తీగలకు అధికారులు హెవీ స్విచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించారు.

గ్రామాలకు వెలుగులు...
గ్రామాల్లో నిత్యం విద్యుత్‌సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇక నుంచి గ్రామల్లో విద్యుత్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఈదురు గాలులు, వర్షాలు వచ్చినప్పుడు కరెంట్ కూడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...